ఆమెను బర్తరఫ్ చేయాలి.. !

CPI-Narayanaజగన్ అక్రమాస్తుల కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గీతారెడ్డిని బర్తరఫ్ చేయాలనే డిమాండ్ క్రమంగా బలపడుతోంది. గీతా రెడ్డికి పదవిలో కొనసాగే హక్కు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. నైతిక బాధ్యత వహించి ఆమె తన పదవికి రాజీనామా చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. మరోవైపు, గీతారెడ్డిని బర్తరఫ్ చేయాలని ఈరోజు సాయంత్రం తెదేపా ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్ కలవనున్నారు. అలాగే, జగన్ కేసులో దర్యాప్తును వేగవంతం చేయాలని గవర్నకు తెదేపా ఎమ్మెల్యేలు వినతిపత్రం అందజేసే అవకాశం వున్నట్లు సమాచారం. ఇదే కేసులో ఇరుక్కొని రాజీనామాలు చేసిన మాజీ మంత్రులు ధర్మాన, సబితల దారిలోనే గీతా రెడ్డి కూడా నడవక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.