మొయిలీతో మొర !

veerappa_moilyకాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీతో సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని ఈ సందర్భంగా వారు మొయిలీని కోరినట్లు తెలుస్తోంది. అనంతరం ఎంపీ అనంత విలేకరులతో మాట్లాడుతూ.. ఆంటోని కమిటీ నివేదిక వచ్చే వరకు హైకమాండ్ పెద్దలు విభజన నిర్ణయంపై ముందుకెళ్లరనే నమ్మకముందని పేర్కొన్నారు. అయితే, సమైక్య వాదన వినిపిస్తున్న సీమాంధ్ర నేతల అబిప్రాయాలను సోనియాగాంధీ గౌరవిస్తారని మొయిలీ అన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద తెలంగాణ ఆగిపోతుందని చెప్పలేదు కాని, సీమాంధ్ర నేతల అభిప్రాయాలను కూడా గౌరవిస్తామని మొయిలీ సీమాంధ్ర నేతలతో చెప్పడం గమనించదగ్గ విశయమే.