వైకాపా దృష్టిలో సీబీఐ, జడ్జీల విలువెంత..?

YS-JAGANతెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు డిల్లీకి వెళతాను అనగానే.. మాకు బెయిల్ రాకుండా చేయడానికేనని మళ్ళీ పల్లవి మొదలెట్టారు వైకాపా శ్రేణులు. వైకాపా కేడర్ సంగతి ఏమో కానీ, ఈ మాట మామూలు జనాలకు అయితే అస్సలు అర్ధం కావడం లేదు. ఎందుకంటే ఈ దేశంలో నిందితుల బెయిల్ విషయాలను నిర్ణయించేది సంబందిత కోర్టులు, వాటిలోని జడ్జీలు మాత్రమే. కాంగ్రెస్ లేదా టీడీపీ లేదా ఇంకెవరైనా జగన్ బెయిల్ ను ప్రబావితం చేస్తున్నారని చెప్పటం.. ఖచ్చితంగా దేశ న్యాయవ్యవస్థను అవమానించటమే. అంతేకాదు పరోక్షంగా.. జగన్ కేసును విచారిస్తున్న హైకోర్టు లేదా సీబీఐ జడ్జీలను అవమానపర్చటమే. ఇదీ కోర్టు ధిక్కారం కిందకి వస్తుంది కదా.. ?

ఎందుకంటే దేశంలో సీఆర్పీసీ చట్టం ప్రకారం సీబీఐ లేదా రాష్ట్ర పోలీసులు ఒక వ్యక్తి మీద సంబందిత కేసులో ఆరోపణలను సంధించి కేసు పెడితే.. న్యాయ మూర్తి ముందుగా కేసు విచారణార్ధం ఆ నిందితుడికి రిమాండ్ విధిస్తారు. ఆ తర్వాత కేసు దర్యాప్తుని, కేసు తీవ్రతని బట్టి కోర్టు బెయిల్ ఇవ్వాలో వద్దో దర్యాప్తు చేస్తున్న సంస్థ ప్రక్రియను అనుసరించి ఒక నిర్ణయం తీసుకొంటుంధి. ఇది జగన్ కేసుకే కాదు, భారత శిక్షా స్మృతి ప్రకారం ఏ కేసుకైనా ఇదే ప్రక్రియను అనుసరిస్తారు.

ఇప్పుడు వైకాపా ఆరోపణల ప్రకారం కోర్టులు, వాటిని నడిపించే జడ్జీల విలువ వైకాపా దృష్టిలో ఇంత తక్కువ అయింధా అనే ప్రశ్న ఉదయిస్తుంధి? ఒక వేళ వైకాపా ఆరోపణలే కాసేపు నిజం అనుకొంటే మరి హైకోర్టు, సీబీఐ కోర్టు జడ్జీల పాత్ర ఏమిటి? ఒక వేళ వైకాపా ఆరోపణలు చేసినట్టు కాంగ్రెస్, టీడీపీ కలిసిపోయి జగన్ బెయిల్ కు అడ్డు పడుతున్నాయని అనుకొంటే..  ఈ దేశ న్యాయ వ్యవస్థలో జడ్జీలు కూడా దీంట్లో పాత్రదారులని ఆరోపించినట్టేగా? ఇధి ఎంత దురదృష్టకరమైన విషయం !

ప్రస్తుతం మన దేశంలో న్యాయ వ్యవస్థ ఒక్కటే అన్నీ వ్యవస్థల్లోకి బాగా పని చేసే వ్యవస్థన్నది వాస్తవం. అయితే, అలాంటి ఆ న్యాయ వ్యవస్థ పైనే.. ఇన్ని ఆరోపణలు చేసే వైకాపాని ఏమనాలి ? రాజ్యాంగ పరంగా ఏర్పడిన న్యాయ వ్యవస్థ పై ఇన్ని అభాండాలు వేస్తున్న వైకాపా మీద సుమోటో గా కేసు ఎందుకు పెట్టకూడధు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే కొద్దో గొప్పో బాగా పని చేసే న్యాయ వ్యవస్థని కూడా వైకాపా లాంటి పార్టీలు తమ నీచ రాజకీయాలకు వాడుకొంటే.. ఇక మనం గొప్పగా చెప్పుకొనే భారత ప్రజాస్వామ్యానికి అర్ధమే లేదు.