మళ్లీ.. ఢిల్లీ బాట !

cm kiranముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రేపు (మంగళవారం) ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణపై నోట్ తయారవుతున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలను అధినేత్రి సోనియా గాంధీ, ఇతర అధిష్టాన పెద్దలకు ముఖ్యమంత్రి వివరించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. మరి.. సమైక్యాంధ్ర స్టార్ బ్యాట్స్ మెన్ గా ముద్రపడిన సీఎం కిరణ్ మరోసారి సమైక్య వాణిని బలంగా వినిపించి విభజనను అడ్డుకుంటురా.. ? లేదా హైకమాండ్ ఆదేశంతో..అంగీకరించి తదుపరి కార్యాచరణకు సహకరిస్తారా.. ? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే, ముఖ్యమంత్రి ముఖ్యంగా.. రాష్ట్ర విభజన పట్ల సీమాంధ్రలో ఏ రేంజ్ లో వ్యతిరేకత వుందో వివరించడానికి నలభై రోజులకు పైగా సీమాంధ్రలో ఏపీ ఎన్జీవోలు చేస్తున్న సమ్మెను అధిష్టానం ముందుకు వుంచే అవకాశం వున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.