సీఎం చివరి టూర్ ఇదేనా.. ?

CM-Kiran-Kumar-Reddyరాష్ట్ర విభజన నిర్ణయాన్ని పునర్ సమీక్షించుకోవాలని కోరేందుకు గాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు (మంగళ వారం) సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితులను ఇటు దిగ్విజయ్ సింగ్ కు, అటు అంటోని కమిటీకి వివరించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ముఖ్యమంత్రికి ఇదే చివరి టూర్ కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో ఇరవై రోజుల్లో తెలంగాణపై కేబినెట్ నోట్ ను తీసుకొస్తామని కేంద్ర కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచేందుకు సీఎం చివరి ప్రయత్నంగా అధిష్టాన పెద్దలతో సమాలోచనలు జరపనున్నారన్న మాట. ఒకవేళ అధిష్టానం ఈ స్టార్ బ్యాట్స్ మెన్ వాదనలను లక్ష్యపెట్టని యెడల.. సీఎం రాజీనామా చేసి తన ప్రాంతంలో ప్రజామద్దతును కూడగొట్టుకునే పనిలో నిమగ్నమయ్యే సూచనలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. విభజన ప్రకటన ముందు, తరవాత కూడా సీఎ తన సమైక్యాంధ్ర ప్రజెంటేషన్ ను ప్రజెంట్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు పరిగణలోనికి తీసుకోని సీఎం వాదనలను ఇప్పుడు కొత్తగా ఆలకిస్తారా.. ? అనేది కూడా అనుమానమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినా.. సీఎంగా లాస్ట్ టూర్ అయితే.. ఆ కిక్కే వేరని కిరణ్ భావిస్తున్నారేమో.. !