సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు భేటీ !

seemandhraకేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు కేంద్రమంత్రులు, ఎంపీలు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈరోజు పార్లమెంట్ ఆవరణలో కేంద్రమంత్రులు, ఎంపీలు సమావేశయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. గత నెల రోజులుగా సీమాంధ్రలో లక్షలాదిమంది ప్రజలు రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేస్తున్నా.. కేంద్రానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని వారు వాపోయినట్లు సమాచారం. ముఖ్యంగా సీమాంధ్రలో సమైక్య జ్వాలలు ఎగసిపడుతుంటే.. తెలంగాణపై కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటన చేయడంపై నేతలు గుర్రుగా వున్నారు. కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి, ఆంటోనీ కమిటీకి తమ వాదనలు మరోసారి గట్టిగా వినిపించేందుకు సమాలోచనలు జరుపుతున్నారు. నిన్న షిండే చేసిన ప్రకటనను వెనక్కు తీసుకునేలా మరో ప్రకటన చేయించాలని కూడా నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు కావూరి, చిరంజీవి, పురంధేశ్వరి, పనబాక, పల్లంరాజు, ఎంపీలు లగడపాటి, అనంత, రాయపాటి, ఉండవల్లి.. తదితరులు హాజరయ్యారు.