విభజిస్తే.. సీమ ఎడారే : సీఎం

kirankumarముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి సమైక్య గళాన్ని గట్టిగా వినిపించారు. తమ ప్రాంతానికి సాగు నీరు విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చిన రాయలసీమ రైతులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విభజన జరిగితే రాయల సీమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందని అన్నారు. సీమ ప్రాంతం ఎడారిగా ప్రమాదం వుందని ఆయన అన్నారు. అయిదు జిల్లాలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. సీమ సమస్యలు పరిష్కరించాకే విభజన ప్రక్రియ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన వల్ల శ్రీశైలం ప్రాజెక్టు వివాదాలకు కేంద్రబిందువు అవుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితులపై కేంద్రం మరింత లోతుగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. అయితే, తనకు స్వార్థం లేదని.. విభజన వల్ల జరిగే నష్టాన్ని నివారించడానికి మాత్రమే విభజన వద్దంటున్నానని సీఎం చెప్పుకొచ్చారు.