మిస్టర్ నూకయ్య, ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలతో తప్పులో కాలేశాడు మంచు మనోజ్. ఆ సినిమాల్లో ఎంత కష్టపడినా – ఏమాత్రం జనాన్ని మెప్పించలేకపోయాయి. ప్రయోగాల కంటే ఎంటర్టైన్ మెంటే బెటరని ఫిక్సయ్యాడు. అందుకే ఇప్పుడు యాక్షన్, కామెడీల నేపథ్యంలో సినిమా చేశాడు. అదే.. పోటుగాడు. సాక్షి చౌదరి, సిమ్రాన్ కౌర్, రేచల్, అనుప్రియ కథానాయికలు. పవన్ వాడేయార్ దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని ఈనెల 13న విడుదల చేయడానికి నిర్మాత లగడపాటి శ్రీధర్ కసరత్తులు చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా శింబు పాడిన పాట చాట్ బస్టర్ అయ్యిందట. ప్యార్మే పడిపోయా పాట కూడా ఆకట్టుకొంటోంది. యాక్షన్ ఘట్టాల్లో మనోజ్ రిస్క్ చేసి మరీ నటించాడట. నలుగురు కథానాయికలున్నారు. అంటే గ్లామర్కీ లోటు ఉండదన్నమాట. మరి.. ఈ పోటుగాడు ఏమాత్రం రాటుదేలాడో చూడాలంటే.. కొన్ని రోజులు ఆగాలి.