ఈ జంట‌.. మ‌ళ్లొక‌సారి

amitab rekhaబాలీవుడ్‌లో ఆల్‌టైమ్ హిట్ పెయిర్ అమితాబ్ బ‌చ్చన్ – రేఖ‌. క‌ల‌సి చేసింది కొన్ని సినిమాలే. కానీ సుదీర్ఘకాలం పుకార్లలో న‌లిగారు. ఇద్దరూ పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డిపోయార‌ని, పెళ్లి చేసుకొంటార‌ని కూడా చెప్పుకొన్నారు. సిల్‌సిలా (1981) త‌ర‌వాత ఈ జోడీ మ‌ళ్లీ క‌నిపించ‌లేదు. ఇంత‌కాలానికి వీరిద్దరినీ తెర‌పైకి తీసుకొచ్చే ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయి. బాలీవుడ్‌లో వెల్‌క‌మ్‌కి సీక్వెల్‌గా వెల్‌క‌మ్ బ్యాక్ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో అమితాబ్‌, రేఖ జంట‌గా క‌నిపిస్తార‌ని స‌మాచార‌మ్‌. ఓ ప్రధాన పాత్రలో న‌టించ‌డానికి అమితాబ్ ఇప్పటికే త‌న అంగీకారాన్ని తెలిపారు. అయితే రేఖ నుంచి స్పంద‌న తెలియాల్సి వుంది. ద‌ర్శకుడు బ‌జ్మీ మాట్లాడుతూ ”ఈ హిట్ పెయిర్‌ని క్యాష్ చేసుకోవాల‌నే ఉద్దేశం మాకు లేదు. రేఖ అయితే ఆ పాత్రకు బాగా స‌రిపోతార‌ని అనిపించింది. అయితే రేఖ మేడ‌మ్ కి ఇంకా క‌థ చెప్పలేదు..” అన్నారాయ‌న‌.