వైకాపా అవకాశ వాద పార్టీ !

T-Harish-Raoవిజయమ్మ బహిరంగ లేఖతో వైకాపా అవకాశ వాద పార్టీ అని తేలిపోయిందని తె రా స ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మెదక్ లో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ పర్యటనలో మద్దతు తెలిపిన విజయమ్మ ఇప్పుడు సమైక్యవాదాన్ని తలకెత్తుకున్నారని ఆరోపించారు. విజయమ్మ రాసిన బహిరంగ లేఖతో వైఎస్సార్సీపీ అవకాశవాద పార్టీ అని తేలిపోయిందని విమర్శించారు. సీమాంధ్ర ర్యాలీలకు ప్రభుత్వం ఎస్కార్ట్ కల్పించి రక్షణ ఏర్పాట్లు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ కోసం శాంతి ర్యాలీ చేస్తుంటే అరెస్టు చేస్తారా ఇదేనా సమైక్య న్యాయం అంటూ ప్రశ్నించారు.