సీమాంధ్రలో కొత్త పార్టీ.. ?

veera-shiva-reddyసీమాంధ్రలో కొత్త పార్టీ పురుడు పోసుకోనుందా..? అంటే అవుననే అంటున్నారు ఎమ్మెల్యే వీరశివారెడ్డి. కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే సీమాంధ్రలో నూతన పార్టీ ఆవిర్భవిస్తుందని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా దిగ్విజయ్ సింగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితి దిగజారిందని వీరాశివారెడ్డి ఆరోపించారు. వీరాశివారెడ్డి మాటలను చూస్తుంటే.. సీఎం కిరణే కొత్త పార్టీ పెట్టేట్లుగా వుందని విశ్లేషకులు గుసగుసలాడుతున్నారు.