యుఎస్ ఓపెన్ భారత్ క్వాలిఫయర్ సోమ్ దేవ్ శుభారంభం చేశాడు. రెండో రౌండ్ లో 4-6, 6-1, 6-2,4-6,6-4 స్కోరుతో స్లొవాక్ ఆటగాడు లుకాస్ లాకోపై సోమ్‌దేవ్ వర్మన్ విజయం సాధించాడు. అంతకు ముందు ఫస్ట్ సెట్లో ఓడిన సోమ్‌దేవ్ ఆ తర్వాత ఎదురు దాడికి దిగడంతో 84వ ర్యాంక్ లూకాస్ చేతులెత్తేశాడు. కీలకమైన మూడో సెట్లో అదే జోరుతో ఆడి 5-2 లీడ్‌కు దూసుకెళ్లిన సోమ్‌దేవ్ గంటా 41 నిమిషాల్లో జయభేరి మోగించాడు.