సుశాంత్‌కి ఓ హిట్టు కట్టబెట్టడానికి చింతలపూడి శ్రీనివాసరావు అండ్ కో తెగ కష్టపడుతున్నారు. అడ్డా హిట్టే అని చెప్పడమే కాదు, సక్సెస్మీట్లూ, ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్లూ పెట్టి నానా హడావుడి చేస్తున్నారు. నాగార్జునను కూడా తీసుకొచ్చి – సుశాంత్ గురించి నాలుగు మంచి ముక్కలు చెప్పించారు. ఈ సినిమా మొదటి రోజే ఫ్లాప్ అని ట్రేడ్ పండితులు తేల్చేశారు. దానికి తగినట్టే ఈ సినిమా వసూళ్లు రెండో రోజు నుంచే డల్ అయిపోయాయి. అయినా సరే – వసూళ్లు సూపరంటే సూపర్ అని తెగ చెప్పేస్తున్నారు. మగధీర సినిమా వల్ల బయ్యర్లు ఎంత లాభపడ్డారో, అడ్డా వల్లా అంతే లాభపడ్డారు అంటూ ఓ పిచ్చి క్యాలుక్యులేషన్స్ చెబుతున్నారు నిర్మాతలు. ఏమిటో ఈ అడ్డదిడ్డమైన లెక్కలు..?