నో యూటర్న్.. !

manmohanరాష్ట్ర విభజనపై ఇప్పుడు వెనక్కు వెళ్లలేమని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. మంగళవారం మంత్రిలు కావూరి, జేడీ శీలం, ఎంపీ లగడపాటిలతో కలసి ఏపీ ఎన్జీవోలు ప్రధాని మన్మోహన్ సింగ్ తో సమావేశమయ్యారు. దాదాపు 15నిమిషాల పాటు ఎన్జీవోల ఏకరువుపెట్టిన సమస్యలను ప్రధాని ఓపిగ్గా విన్నారు. అయితే, సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఈ పరిస్థితితుల్లో యూటర్న్ తీసుకోలేమని.. ఏమైనా సమస్యలుంటే ఆంటోని కమిటీకి నివేదించండని ప్రధాని ఎన్జీవో నేతలకు సూచించారు. విభజన అనంతరం తలెత్తే సమస్యలపై పూర్తి బాధ్యత మాదేనని ప్రధాని బరోసా ఇచ్చినట్లు తెలిస్తోంది. హైదరాబాద్ గురించి ప్రస్తావనకు రాగా.. ఎవరు ఎక్కడైనా వుండవచ్చని అందులో ఎలాంటి సందేహం లేదనే ధోరనిలో ప్రధాని స్పందించినట్లు సమాచారం.

ప్రధానితో సమావేశం అనంతరం ఏపీ ఎన్జీవోలు ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్ది తదితరులతో సమావేశమయి సమైక్య కోసం సపోర్ట్ చేయమని కోరినట్లు తెలుస్తోంది. కాగా, స్వయంగా ప్రధానే విభజన విషయంలో వెనక్కు వెళ్లలేం అని తేల్చిచెప్పిన నేపథ్యంలో.. తదుపరి కార్యచరణ దిశగా ఏపీ ఎన్జీవోలు సమాలోచనలు చేస్తున్నారు. కాగా, ప్రధాని సూచించినట్లుగా ఆంటోని కమిటీ ముందుకు వెళ్లాలా.. ? వద్దా అనే విషయాన్ని అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ ఎన్జీవోల చైర్మెన్ అశోక్ బాబు పేర్కొన్నారు.