చిరంజీవి మళ్ళీ మాయమయ్యాడా ?

chiruగత వారంలో వివిధ పెళ్ళిళ్ళలో తళుక్కుమని టీవీ లలో మెరిసి ఆంద్ర ప్రజలకూ నేనూ వున్నాను అని చెప్పిన చిరంజీవి మళ్ళీ ఆంద్రప్రదేశ్ నించి మాయమయ్యారు. ఆంద్ర ప్రదేశ్ ని విభజించాలి అని కాంగ్రెస్ సి డబ్ల్యుసి నిర్ణయించిన క్షణం నుంచి రాయలసీమ ఆంధ్ర ప్రాంతాల్లో ఎన్ని ఆందోళనలు జరుగుతున్నా కూడా తనకు ఏమీ సంభందం లేనట్టు వుండిపోయారు కాంగ్రెస్ కేంద్ర మంత్రి చిరంజీవి. అప్పుడప్పుడు సీమాంధ్ర మంత్రులు ఏం.ఎల్.ఏ లు ఏంపీ లతో పాటు సోనియా దగ్గరకు వెళ్లిరావడం, బయటకు వచ్చి నాలుగు స్టేట్మెంట్ లు ఇవ్వడం తప్పిస్తే ఇక్కడ ఆందోళనల వైపు ఆయన కన్నెత్తి కూడా చూడలేదు.

కానీ గత వారం హైదరాబాదులో జరిగిన కొంత మంది ప్రముఖుల పెళ్లిళ్లకు మాత్రం టన్చన్ గా వచ్చి హాజారు వేయించుకొని వెళ్ళారు. పెళ్ళిళ్ళు అయిపోగానే పార్లమెంటు సమావేశాల నెపంతో డిల్లీ వెళ్ళిపోయారు. తనకు రాజ్య సభ ఇంకా నాలుగున్నర సంవత్సరాలు వుంది కాబట్టి ఇక ప్రజలతో ఎన్నికయ్యే పని ఇప్పట్లో లేదు కాబట్టి, ఆంద్ర రాయలసీమలకు వచ్చి లేని పోనీ తల నొప్పులు ఎందుకు అనుకోన్నారేమో, హైదరాబాద్ లో మాయమయ్యి మళ్ళీ డిల్లీలో తేలారు. ఎలాగూ అయన సమైఖ్య వాదే. మరింక ఆంద్ర రాయలసీమ లో పోరాడడానికి వచ్చిన అడ్డంకి ఏదీ అని ఆరా తీస్తే, కొడుకు రాం చరణ్ సినిమాని ఒక కారణంగా చెప్తున్నారు కొందరు. భారీ బడ్జెట్ తో హిందీ తెలుగు భాషలలో ఒకేసారి తీస్తున్న పాత తరం అమితాబ్ సూపర్ హిట్ ‘జంజీర్’ చిత్రానికి రీమేక్ అయిన ‘ఎవడు’ చిక్కుల్లో పడుతుందేమో అని ఒక కారణంగా చెప్తున్నారు. పైగా ఫిలిం నగర్ సమాచారం ప్రకారం ముందుగా జంజీర్ హంద్ వెర్షన్ విడుదల చేస్తే ఎలా ఉంటుందో అని కూడా ఆలోచిస్తునట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో తనకు బాగా పట్టున్న నైజాం ప్రాంతంలో వివాదాలు వస్తే ఆర్ధికంగా నష్టం అనుకోన్నారేమో !!

ఒకప్పుడు ఏం.ఎల్.ఏ గా వున్నప్పుడు కనీసం తిరుపతి తన నియోజకవర్గం కాబట్టి అప్పుడప్పుడు అయినా అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు రాజ్య సభ కాబట్టి తాను రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి జవాబుదారి కాదనుకోన్నారో ఏమో..ఒక వైపు రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటుతున్నా, ప్రజలు ఆందోళన లతో హోరెత్తిస్తున్నా అసలు రాష్ట్రం వైపు కన్నెత్తి చూడడం మానేశారు చిరూ సార్.