మంత్రి గీతారెడ్డికి సీబీఐ సమన్లు !

geeta reddyజగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి రాష్ట్ర మంత్రి గీతారెడ్డికి సోమవారం సీబీఐ సమన్లు జారీ చేసింది. లేపాక్షి నాలెడ్జ్ భూ కేటాయింపులు వ్యవహారంలో గీతారెడ్డిని సీబీఐ ప్రశ్నించనుంది. దివంగత వైఎస్ హయాంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా గీతారెడ్డి పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే లేపాక్షికి భూ కేటాయింపులు జరిగాయి. నేడు, రేపు విచారణకు అందుబాటులోనే ఉండాలని ఆమెను సీబీఐ ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఇంట్లోనే విచారించే అవకాశం వున్నట్లు సమాచారం. సెప్టెంబర్ మొదటి వారంలోగా ఈ కేసులో చార్జ్ షీటు దాఖలు చేయవలసి ఉండటంతో ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీమంత్రి ధర్మానను సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. దాంతో, వరసగా ఒక్కొక్క మంత్రిని విచారిస్తోంది.