వ‌ర్మ మ‌ళ్లీ రంగంలోకి దిగాడా?

ramgopal-varmaఈమ‌ధ్య ఎక్కడా రాంగోపాల్‌వ‌ర్మ అలికిడి లేదు. స‌త్య 2 తీశాడు గానీ – ఈ సినిమాకి ఇంకా మోక్షం లభించ‌లేదు. ఏదో ట్విట్టర్ల‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని తెగ పొగిడేసి ప్రచారం చేసుకొన్నాడు త‌ప్పితే – కొత్త సినిమా సంగ‌తులేం చెప్పడం లేదు. కానీ ఆయ‌న నుంచి ఓ రెండు సినిమాలు రానున్నాయ‌ని స‌మాచార‌మ్. ప‌ట్టప‌గ‌లు అనే ఓ దెయ్యం సినిమా తీస్తున్నాడ‌ట‌. ఇప్పటి వ‌ర‌కూ రాత్రి వేళ‌ల్లో భ‌య‌పెట్టా, ఈసారి ప‌ట్టప‌గ‌లే భ‌య‌పెడ‌తా అంటున్నాడు. రెండోది బ్రూస్‌లీ. వ‌ర్మని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో బ్రూస్‌లీ ఒక‌రు. ఆయ‌న స్ఫూర్తితోనే వ‌ర్మ క‌రాటే కూడా నేర్చుకొన్నార‌ట‌. ఇప్పుడు ఆ పేరుతో ఓ సినిమా తెర‌కెక్కడం ఆస‌క్తిని క‌లిగించేదే. ఈ సినిమాని కేవ‌లం 30 రోజుల్లో తీసేస్తా.. అంటున్నాడు వ‌ర్మ‌. దొంగ‌ల ముఠా 5 రోజుల్లో తీశాడు. 30 అంటే వ‌ర్మకు ఎక్కువే మ‌రి.