పేద ప్రజల అభివృద్దే మా ధ్యేయం : సోనియా

soniaయూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ’ఆహార భద్రత బిల్లు’పై లోక్ సభలో వాడి వేడి చర్చ జరుగుతోంది. సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి మాట్లాడుతూ.. 2009 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లోక్ సభలో ‘ఆహార భద్రత బిల్లు’ ప్రవేశపెట్టామని అన్నారు. తమ హామీని నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఈ బిల్లు ద్వారా చారిత్రాత్మక అడుగువేసే అవకాశం దక్కిందన్నారు ఆమె పేర్కొన్నారు. ఏ చిన్నారి కూడా పోషకాహార లోపంతో బాధపడకూడదన్నదే తమ లక్ష్యమని సోనియా స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ బిల్లు ద్వారా రైతులకు సైతం లబ్ది కలుగుతుందన్నారు. బిల్లు ద్వారా ఆహారధాన్యాలు వ్యర్ధం కాకుండా చూడవచ్చని ఆమె అన్నారు. ఆహార భద్రత బిల్లుతో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని సోనియా తెలిపారు. కాగా, ఆధార్ అనుసంధానంతో భవిష్యత్తులో రాయితీల దుర్వినియోగాన్ని నివారించవచ్చని సోనియా చెప్పుకొచ్చారు. మరోవైపు నాలుగున్నర సంవత్సరాలుగా బిల్లును ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించాయి. ఇది కేవలం రాజకీయాల కోసమేనని దయ్యబడుతున్నాయి. లోక్ సభలో “ఆహార భద్రతా బిల్లు”పై చర్చ ఇంకా కొనసాగుతూనే వుంది.