మాజీమంత్రి, తెలంగాణా కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి కడుపులు పగిలిపోయేంత జోక్ విసిరారు. దివంగత ముఖ్యమంత్రులు ఎన్.టి. రామారావు, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి లు జీవించివుంటే ప్రత్యెక తెలంగాణా కు మద్దత్తు పలికేవారని, సమైక్యాంధ్ర కు వ్యతిరేకంగా పోరాడేవారని జీవన్ రెడ్డి అన్నారు. వారిరువురూ బతికివుంటే అసలు కృత్రిమ సమైక్యాంధ్ర ఉద్యమం ఉండేదేకాదని కూడా ఆయన తెలిపారు. ఎన్.టి.ఆర్., వై.ఎస్.ఆర్. లు ఇద్దరూ పక్కా సమైక్య వాదులు అన్న విషయం ఈ రాష్ట్రంలో పసిపిల్లలకు కూడా తెలుసు. మరి ఇంత చిన్నవిషయం ఈ పెద్దాయనకు ఎందుకు తెలియదో అర్ధం కావటంలేదు. విశేషమేమిటంటే ఈ ఇరువురు ముఖ్యమంత్రుల క్యాబినెట్లలోనూ జీవన్ మంత్రిగా పనిచేశారు. తెరాస అధ్యక్షుడు కె సి ఆర్ పై రెండుసార్లు పోటీ చేసి జీవన్ ఓడిపోయారు. వారిద్దరి సమైక్య వాదం గురించి క్షుణ్ణంగా తెలిసిన జీవన్ ఇలా ఎందుకు వ్యాఖ్యానించారో అంతుబట్టక రాజకీయ విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. వై ఎస్ ఆర్ ముఖ్యమంత్రిగా వుండగా 2009 లో తెలంగాణాకు అనుకూలంగా అసెంబ్లీ తీర్మానం చేసినప్పటికీ ఆయన ఎప్పుడూ రాష్ట్రం కలిసి ఉండాలనే కోరుకున్నారనేది అందరికి తెలిసిందే. 2009 ఎన్నికలలో చివరిక్షణంలో వై ఎస్ ఆర్ తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడి సీమాంధ్ర లో సీట్లు గెలుచుకున్నారు.