తమ్మినేని మళ్లీ జంప్ !

tammineniఉత్తరాంధ్ర కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రవిభజన విషయంలో చంద్రబాబు నాయుడు తెలంగాణా కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు నిరసనగా తాను పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు తమ్మినేని ప్రకటించారు. గత కొంతకాలంగా తమ్మినేని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాను త్వరలో సమైక్యాంధ్ర కు మద్దత్తుగా సీమాంధ్ర లో పర్యటించనున్నట్టు ఆయన తెలిపారు. కాగా చాలాకాలంగా తమ్మినేని వై ఎస్ ఆర్ పార్టీ లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బహుశా రెండు మూడు రోజుల్లో జైలులో వున్న జగన్ ను కలిసేందుకు తమ్మినేని ఏర్పాట్లు చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది.ఆదినుంచీ తెలుగుదేశం పార్టీలో వుండి పార్టీ అధికారం లో వుండగా మంత్రిగా కూడా పనిచేసిన తమ్మినేని ఆ తరువాత చిరంజీవి నెలకొల్పిన ప్రజారాజ్యం లో చేరి పోటీచేసి ఓడిపోయారు. వెంటనే ప్రజారాజ్యం కు రాజీనామా చేసి మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన కన్ను వై ఎస్ ఆర్ పార్టీ పై పడింది.