సుశాంత్‌ మ‌రో సినిమా

sushantఅడ్డా సినిమా కాస్త అటూ ఇటూ అయినా మా సినిమా సూప‌ర్ అంటూ బిల్డప్పులు ఇచ్చుకొంటోంది శ్రీ‌నాగ్ కార్పొరేష‌న్‌. వెంట‌నే మ‌రో సినిమాని తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేసుకొంటోంది. ఈసారీ కొత్త ద‌ర్శకుడికి అవ‌కాశం ఇస్తార‌ట‌. ప్రభుదేవా సోద‌రుడు విష్ణు దేవా ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తార‌ట‌. బ్యాంకాక్‌లో అడ్డా షూటింగ్ సంద‌ర్బంలో విష్ణుదేవా ఈ క‌థ వినిపించాడ‌ట‌. విన్న వెంట‌నే సుశాంత్‌కి భ‌లే న‌చ్చేసింద‌ట‌. `మా సుశాంత్‌కి నూటికి నూరుపాళ్లూ స‌రిపోయే క‌థ ఇది` అని చింత‌ల పూడి శ్రీ‌నివాస‌రావు చెబుతున్నారు. మారుతితో కూడా ఓ సినిమా చేస్తార‌ట‌. ఈ కొత్త సినిమాల సంగ‌తులు ఇంకొన్ని రోజుల్లో తెలుస్తాయి.