200 కోట్లు కొల్లగొట్టాడు…

sharukh-khanబాలీవుడ్ బాద్‌షా… ఈ పేరుని మ‌రోసారి సార్థకం చేసుకొన్నాడు షారుఖ్ ఖాన్. యంగ్ హీరోలు విజృంభిస్తున్నా – త‌న స‌త్తా చాటుకొన్నాడు. బాక్సాఫీసు ద‌గ్గర భారీ విజ‌యం లేని లోటుని తీర్చుకొన్నాడు. చెన్నై ఎక్స్‌ప్రెస్ రికార్డు స్టేష‌న్లను దాటుకొంటూ దూసుకుపోతోంది. కేవ‌లం రెండు వారాల్లో రూ.200 కోట్లు సాధించి… వారెవా అనిపించింది. తొలి వార‌మే ఏకంగా రూ.150 కోట్లు వ‌సూలు చేసిందీ చిత్రం. రెండో వారంలో రెండువంద‌ల కోట్ల మైలురాయి అందుకొంది. మిశ్రమ స్పంద‌న వ‌చ్చినా.. ఈ రేంజులో ఈ సినిమా వ‌సూళ్లు కొల్లకొడుతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేక‌పోయారు. షారుఖ్ మ్యాజిక్ ముందు మిక్స్‌ డ్ టాక్ కూడా ఏమీ చేయ‌లేక‌పోయింది.