ఆ వీడియో నాది కాదు: అమితాబ్

Amitabh-Bachchan-slams-fake-video-says-he-did-not-endorse-Modiగుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కాబోయే ప్రధాని అని తాను చెప్పినట్లు వచ్చిన వార్తలను అమితాబ్ బచ్చన్ ఖండించారు. దీనికి సంబంధించి యూ ట్యూబ్ లో చెలామణిలో ఉన్న వీడియో నకిలీదని, దానింతో తనకు సంబంధం లేదన్నారు. నా వాయిస్, ఆ వీడియో లో నేనాడిన మాటలను వాడుకొని ఎవరో నకిలీ వీడియో రూపొందించారని వివరణ ఇచ్చారు. ఇలాంటి తప్పుడు పనికి పాల్పడిన వారిపై తీవ్ర చర్యలు తప్పవని చెప్పుకొచ్చారు. అసలు, నకిలీ వీడియోలను ఎడిట్ చేసి తన ఫేస్ బుక్ లో పెట్టి పూర్తి వివరణ ఇచ్చారు బిగ్ బి.