ద‌స‌రాబుల్లోడు సునీల్‌

sunil bhimavarm bulloduత‌డాఖా ద‌య‌తో సునీల్ కూడా ఫామ్‌లోకి వ‌చ్చాడు. మిస్టర్ పెళ్లికొడుకు సినిమాతో అంద‌రినీ నిరాశ ప‌రిచిన సునీల్‌కి త‌డాఖా విజ‌యం ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు ఉద‌య్ శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో న‌టిస్తున్నాడు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి భీమ‌వరం బుల్లోడు అనే టైటిల్ పెట్టారు. అయితే భీమ‌వ‌రం అనే సౌండింగ్ ద‌గ్గర… డౌట్ కొట్టేసింది. తెలంగాణ‌, ఆంధ్రా గొడ‌వ‌లె ఉదృతం అవుతున్న త‌రుణంలో ఓ ప్రాంతాన్ని సూచిస్తూ పేరు పెట్టడం క‌రెక్ట్ కాద‌ని చిత్రబృందం అనుకొంటోంది. అందుకే ఈ సినిమా పేరు ద‌స‌రా బుల్లోడుగా మార్చార‌ట‌. సునీల్‌కి ఈ టైటిల్ కూడా యాప్ట్‌గానే ఉంటుంది. కొత్త టైటిల్ త్వర‌లోనే ప్రక‌టిస్తారు.