ఆరడుగుల బుల్లెట్

bolt-completes-sprintజమైకా స్టార్ స్ప్రింటర్, అథ్లెట్ ఉసేన్ బోల్ట్ వాయువేగంతో పరిగెత్తి 200 మీటర్ల రేసులోనూ విజేతగా నిలిచాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం జరిగిన పురుషుల 200 మీటర్ల రేసును బోల్ట్ 19.66 సెకన్లలో పూర్తి చేశాడు. ప్రస్తుత చాంపియన్‌షిప్‌లో రెండో స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. వారెన్ వీర్ (జమైకా-19.79 సెకన్లు) రజతం… కర్టిస్ మిచెల్ (అమెరికా-20.04 సెకన్లు) కాంస్యం నెగ్గారు. గత సోమవారం జరిగిన 100 మీటర్ల రేసులోనూ బోల్ట్ పసిడి పతకాన్ని నెగ్గిన సంగతి తెలిసిందే. తాజా విజయంతో బోల్ట్ ఖాతాలో మరో పసిడిపతకం వచ్చిచేరింది.