సినిమా సినిమాకీ వయసులో పదేళ్లు వెనక్కి వెళ్లడం నాగ్ అలవాటు. ప్రతి సినిమాకీ స్టైలీష్ గా కనిపించి – అభిమానుల దగ్గర మార్కులు కొట్టేస్తుంటారు. భాయ్ లోనూ అదే చేశారు. భాయ్ టీజర్ శుక్రవారం రాత్రి యూ ట్యూబ్ లో విడుదలైంది. ఈ బుల్లి ప్రచార చిత్రంలో నాగ్ స్టైల్ తో మరోసారి మెస్మరైజ్ చేశాడు. ఈ ఫీల్డులో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే నేనేరా.. అంటూ ఓ పవర్ ఫుల్ డైలాగ్ కూడా వదిలాడు. మొత్తమ్మీద నాగ్ మరోసారి రొమాంటిక్ డాన్ గా కనిపించడానికి సిద్ధమైనట్టే. రగడ తరవాత సరైన సినిమాలేని నాగ్.. భాయ్ తో మాస్, క్లాస్ ని అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. రిచా గంగోపాధ్యాయ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి వీరభద్రమ్ దర్శకుడు. సెప్టెంబరు1న ఈ చిత్రంలోని గీతాల్ని విడుదల చేస్తారు.