ఎవ‌డు అక్టోబ‌రులోనే..!

Yevadu

అనుకొన్నంతా అయ్యింది. ఎవ‌డు సినిమా వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. జులై 24న రావ‌ల్సిన ఈ సినిమాని 31కి వాయిదా వేశారు. అప్పటి నుంచి ఈ సినిమా ప్రేక్షకుల‌తో దోబూచులాడుకొంటూనే ఉంది. ఈనెల 21న వ‌చ్చేస్తుంద‌ని చెబుతున్నా… ఈ సినిమా ఈ నెల‌లో రావ‌డం లేద‌ని తేలింది. అత్యంత విశ్వశ‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ సినిమా అక్టోబరుకి వాయిదా ప‌డింది. సెప్టెంబ‌రులో తుఫాన్ వ‌స్తుంది. ఆ త‌ర‌వాత రామ‌య్యా వ‌స్తావయ్యా లాంటి పెద్ద సినిమా ఉంది. అందుకే ఈ సినిమాని అక్టోబ‌రుకి తీసుకెళ్లిపోయార‌ని తెలిసింది. అక్టోబ‌రు రెండో వారంలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవ‌కాశం ఉంది.