అత్తారింటికి దారేది ఆడియో ఇప్పటికే సూపర్ హిట్టు. ఆరు పాటలూ పవన్ ఫ్యాన్స్‌కి తెగ నచ్చేశాయి. ఇందులో మరో పాట ఉంది. అది స్వయంగా పవన్ కల్యాణ్ పాడాడు. ఈ పాట ఆడియోలో వినిపించలేదు. గప్‌చుప్‌గా దాచి విడుదల రోజున తెరమీదే చూపిద్దాం అనుకొన్నారు. ఈలోగా సినిమా వాయిదా పడింది. పవన్ అభిమానుల్ని ఇంకా వెయిట్ చేయించడం, ఊరించడం చిత్ర బృందానికి నచ్చలేదేమో. అందుకే పవన్ పాడిన పాట ఫ్యాన్స్‌కి వినిపించాలని నిర్ణయించుకొన్నారు. ఈ సినిమాలో పవన్ పాడిన పాట నేరుగా యూ ట్యూబ్‌లో విడుదల చేస్తారు. టీజర్, ట్రైలర్లను లక్షల్లో వీక్షించారు పవన్ ఫ్యాన్స్. మరి పవన్ పాటను ఏ రేంజులో ఆదరిస్తారో..