విషాదంలో మునిగిన సీమాంధ్ర

seemandraప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతో ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇప్పటివరకూ అన్నదమ్ముల్లా కలిసివున్న రెండుప్రాంతాల ప్రజలను విడదీస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందనీ, తప్పనిసరిగా తెలుగు జాతి ఉసురు తగులుతుందని అక్కడి ప్రజలు బహిరంగంగా శాపనార్ధాలు పెడుతున్నారు. ఏదో ఒకరోజున తెలంగాణా విడిపోవటం తప్పనిసరి తెలిసినప్పటికీ అది వాస్తవరూపం దాల్చటాన్ని తాము తట్టుకోలేక పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాన్ని అడ్డుకోవటంలో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నాయకులు పూర్తిగా విఫలమయ్యారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన ను తట్టుకోలేక కొందరైతే భోరున ఏడుస్తున్నారని, ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దురదృష్టకరమైన రోజుగా భావించాల్సి ఉంటుందని సమైక్యాంధ్ర జె ఎ సి నాయకులు చెబుతున్నారు. కళ్ళముందు తెలుగు తల్లిని నిట్టనిలువునా పంచేసుకుంటుంటే తమ గుండెలు రగిలిపోతున్నాయని వారు పేర్కొన్నారు.