అన్న గా వస్తున్న విజయ్

Thalaivaతుపాకి తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ కధానాయకుడు విజయ్. తమిళం లో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. ఇప్పుడు అక్కడ తలైవా సినిమా చేస్తున్నాడు. ఏ యల్ విజయ్ (నాన్న ఫేం) దర్శకుడు. అమలాపాల్ కధానాయిక. ఈ సినిమా ని తెలుగులో అన్న గా విడుదల చేస్తున్నారు. కార్తి, సూర్య లతో పోలిస్తే విజయ్ కి తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు. కానీ తెలుగు మార్కెట్ ని కొల్లగొట్టడానికి విజయ్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. తుపాకి ఇ క్కడి ప్రేక్షకులకి చాలా నచ్చింది. ఇప్పుడు అన్న గానూ మెప్పిస్తే.. విజయ్ కి కూడా మంచి మార్కెట్ ఏర్పడుతుంది. మరి అది జరుగుతుందో లేదో చూడాలి.