ప్రధానితో సోనియా బేటీ !

sonia chiontan shivirప్రధాని మన్మోహన్ సింగ్ తో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమావేశమయ్యారు. ఈ రోజు సాయంత్రం జరగబోయే సీడబ్ల్యూసీ, యూపీఏ సమావేశాల అంశంపై చర్చించేందుకు ఆమె ప్రధానిని కలిసినట్లు తెలుస్తోంది. తెలంగాణ అంశంపై సాయంత్రం నిర్వహించనున్న రెండు సమావేశాల అనంతరం వెల్లడించాల్సిన నిర్ణయం తీరుతెన్నులు.. తదనంతర పరిణామాలపై సవివరంగా సోనియా ప్రధాని మన్మోహన్ సింగ్ తో చర్చిస్తున్నట్లు సమాచారం.