వరుణ్ కి ఇప్పుడైనా హిట్ దక్కుతుందా?

varun-sandeshగత రెండేళ్లుగా ఎడా పెడా సినిమాలు చేసేస్తున్నాడు వరుణ్ సందేశ్. ఆ సినిమాలు వరుణ్ బ్యాంకు బాలెన్స్ పెంచాయిగాని, హీరో గా ప్రత్యేకమైన ముద్ర వేయలేకపోయాయి. అన్నీ ఎలా వచ్చి అలా వెళ్ళాయి. ప్రియతమా నీవచట కుశలమా, చమక్ చల్లో, సరదాగా అమ్మాయితో సినిమాలు దారుణ పరాజయాన్ని మూట గట్టుకున్నాయి. ఇప్పుడు మరో సినిమా జనం ముందుకు వస్తోంది. అదే.. క్లాస్ అబ్బాయి – మాస్ అమ్మాయి. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ఎప్పుడో పూర్తి అయ్యింది. కానీ – విడుదల చేయడానికి మీనమేషాలు లెక్కెట్టారు నిర్మాతలు. ఈ సినిమా కొనడానికి ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. వొచ్చిన రేటు కి అమ్ముకుని ఎట్టకేలకు విడుదల చేస్తున్నారు. వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న వరుణ్ … ఇప్పటికైనా హిట్ కొట్టాలి. లేదంటే మరో ఉదయ్ కిరణ్, తరుణ్ లా మిగిలిపోయే ప్రమాదం వుంది.