రాయలకూ.. ఒప్పుకోం : ఎంఐఎం

Asaduddin-Owaisiరాష్ట్ర విభజనకు అంగీకరించే ప్రసక్తే లేదని ఎంఐఎం స్పష్టం చేసింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ.. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. పది జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ, రాష్ట్రాన్ని గానీ, రాయల తెలంగాణను గానీ అంగీకరించేది లేదని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసిన సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. గతంలో ’సమైక్య వాదం’ లేదా విభజన అనివార్యమైతే.. ’రాయల తెలంగాణ’ అని చెప్పుకొచ్చిన ఎంఐఎం ఇప్పుడు సమైక్యాంధ్ర తప్ప మరోకదానికి అంగీకరించేది లేదని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసే విషయమే. కాగా, కేంద్రం నిర్ణయం తరవాతే తమ తుదిపరి కార్యాచరణ వుంటుందని అసద్ ప్రకటించారు