విభజిస్తే కిరణ్ రాజీనామా చేస్తారట!

tg-venkateshరాష్ట్రాన్ని విభజిస్తే సీఎం కిరణ్ రాజీనామా చేస్తారని టీజీ వెంకటేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేదే తమ ప్రధాన ధ్యేయమని, పార్టీలన్నీ ప్రత్యేక తెలంగాణకు అభ్యంతరం లేదని చెప్పడంతో రాష్ట్ర విభజన దిశగా కేంద్రం  అడుగులు వేస్తోందని వాపోయారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల ప్రాతిపదిక తీసుకుంటే రాయలసీమ ప్రాంతమే కోస్తా, తెలంగాణల కంటే వెనుకబడిన ప్రాంతమని అన్నారు.

ఇప్పటికైనా టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్రానికి లేఖ ఇవ్వాలని కోరారు.  ఒక వేళ విభజిస్తే రాయలసీమ పరిస్థితేంటో తెలుసుకోవాలని సీఎంను కోరినట్టు తెలిపారు. విభజనే పరిష్కారమైతే 6 జిల్లాలతో గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలను రాయలసీమలో కలపాలని కోరారు. తెలంగాణ ప్రకటిస్తే సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్దంగా ఉన్నారని టీజీ స్పష్టం చేశారు.