’ఫర్ గాడ్స్ సేక్ డొంట్ డివైడ్’

For-Gods-sake,-Don't-Divideఅధిష్టానం రాష్ట్ర విభజనకే మొగ్గు చూపుతున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చివరి క్షణం వరకు పోరాడిన యోధుడుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గుర్తింపు పొందుతారా.. ? ఎందుకంటే.. రాష్ట్రాన్ని సమైక్యాంగా ఉంచడానికి కిరణ్ శతవిధాల ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆయన అధిష్టానం పెద్దల ముందు చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. “ఫర్ గాడ్స్ సేక్ డొంట్ డివైడ్” అని కిరణ్ అధిష్టానంతో అనడం.. విభజనపట్ల ఆయన ఆవేదనకు అద్దం పడుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నిన్న అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయింది కూడా కేవలం అయిదు నిమిషాలేనంట.. నిర్ణయం అయిపోయిందన్న సంకేతం అమ్మ ఇచ్చిందని.. దాంతో మౌనంతోనే ముఖ్యమంత్రి బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు కిరణ్ ఏమీ చేసిన చరిత్రలో నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రం ఇచ్చేముందు.. రాజీనామా చేసినా.. ఉండి రాష్ట్ర విభజనకు సహకరించిన ఆంధ్రపదేశ్ చివరి ముఖ్యమంత్రిగా.. అదీ గాక రాష్ట్ర విభజనకు అడ్డుపడిన తెలంగాణకు మొదటి ద్రోహీగా ఇలా.. ఎలా చూసిన చరిత్రలో కిరణ్ కిరణంలా నిలిచేపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకుల భావన.