పంచాయితి సమరంలో
ఎకగ్రీవాల జోరు !
గెలిచినోడు మా వోడే
పార్టీలన్నిటి పోరు !!
జెండాలే లేనప్పుడు
ప్రతివాడూ మనోడే !
ఆత్మవంచనలు వద్దూ
సామాన్యుడు పనోడే !!
డబ్బూ సారాయి తోటి
గ్రామాలను తడిపేసేయ్ !
పచ్చటి పల్లెల శాంతిని
నవ్వుతునే నలిపేసేయ్ !!
అన్నయినా తమ్ముడైన
చంపేస్తూ రెచ్చిపో !
మానవత్వమా నీవిక
రెచ్చిపోయి చచ్చిపో !!
– ఏవీయస్