14న‌..? కాదు 7నే!

pavanఅత్తారింటికి దారేది రిలీజ్ డేటుపై ఇంకా అభిమానుల‌కు కొన్ని సందేహాలు వెంటాడుతూనే ఉన్నాయ్‌. ఈ సినిమాని వారం రోజులు ఆల‌స్యంగా తీసుకొచ్చే ఛాన్స్ ఉంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఓ వార్త చ‌క్కర్లు కొడుతుంది. ఎవడుకు వెసులుబాటు క‌ల్పించేలా ప‌వ‌న్ త‌న సినిమా విడుద‌ల తేదీ మార్చమ‌ని నిర్మాత‌కు సూచించిన‌ట్టు టాక్‌! అయితే ఇది గాలివార్తే అని అత్తారింటికి దారేది నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ తేల్చి చెబుతున్నారు. ఎట్టి ప‌రిస్థితిల్లోనూ ఈ సినిమాని ఆగ‌స్టు 7న తీసుకురావ‌డం ఖాయ‌మంటున్నారు. ఎలాంటి గాలి వ‌ర్తల్ని న‌మ్మొద్దని కోరుకొంటున్నారు. ప‌వ‌న్ సినిమా అనుకొన్న స‌మ‌యానికే వ‌స్తోంది. డోన్ట్ వ‌ర్రీ ఫ్యాన్స్…!