రాణి రుద్రమ కోసం భారీ స్టార్ కాస్టింగ్‌ని రంగంలోకి దింపుతున్నారు గుణశేఖర్. తన సినిమాకి కొత్త కొత్త సొబగులు, ప్రత్యేకతలూ తీసుకొచ్చి ప్రేక్షకుల దృష్టి తన సినిమాపై పడేలా చూసుకొంటున్నారు. ఇప్పుడాయన మహేష్‌బాబుని కూడా రంగంలోకి దింపేశారు. రాణి రుద్రమలో ఓ యువరాజు పాత్ర ఉంది. ఆ పాత్ర మహేష్‌తో చేయించారట గుణశేఖర్. ఇటీవలే ఆ సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిపోయిందట. ఈ పాత్ర కేవలం రెండు, మూడు నిమిషాల పాటే తెరపై కనిపిస్తుందని.. కానీ ప్రేక్షకుల్ని ఓ థ్రిల్‌కి గురిచేసేలా ఉంటుందని తెలిసింది. మహేష్‌బాబు రంగ ప్రవేశంతో ఈ సినిమాకి కొత్త ఊపు వచ్చింది. తెరపై ప్రిన్స్… నిజమైన ప్రిన్స్‌లా ఎంతిలా మెప్పిస్తాడో చూడాలి.