దేవి ప్రసాద్‌కి ఏమైంది?

deviprasadచిత్రసీమ‌లో అవ‌కాశం రావ‌డ‌మే గ‌గ‌నం. అలా వ‌చ్చిన అవకాశం నిల‌బెట్టుకోలేక‌పోతే అది వాళ్ల దుర‌దృష్టం. ద‌ర్శకుడు దేవి ప్రసాద్‌కి ఇలాంటి అవ‌కాశాలు చాలా వ‌చ్చాయ్‌. కానీ వాటిని నిల‌బెట్టుకోవ‌డంలో విఫ‌లం అవుతూనే ఉన్నాడు. మిస్టర్ పెళ్లికొడుకు, కెవ్వుకేక సినిమాలు ఇందుకు ఉదాహ‌ర‌ణ‌లు. సునిల్‌, న‌రేష్ ఇద్దరూ మినిమం గ్యారెంటీ క‌థానాయ‌కులే. వీరి కెరియ‌ర్లో డిజాస్టర్ సినిమాల్ని ఇచ్చాడు ఈ ద‌ర్శకుడు.

బాలీవుడ్‌లో ఘ‌న‌విజ‌యం సాధించిన త‌ను వెడ్స్ మ‌నుని యావ‌రేజ్ సినిమాగా కూడా మ‌ల‌చ‌లేక‌పోయాడు. ”సునీల్ జోక్యం మ‌రీ ఎక్కువైపోయింది. అందుకే ఈ సినిమా గురించి నేనేం చేయ‌లేక‌పోయా” అని అప్పట్లో స‌న్నిహితుల‌తో చెప్పుకొన్నాడ‌ట ఈ ద‌ర్శకుడు. మ‌రి ఇప్పుడేమైంది?? న‌రేష్ కూడా కెలికేశాడా?? ఇప్పుడు ఈ ఫ్లాప్‌ని ఎవ‌రిపై తోసేస్తాడు??

న‌రేష్ సినిమా అంటే జ‌నం న‌వ్వుకోవ‌డానికి వెళ్తారు. కానీ ఆ న‌వ్వులు కెవ్వు కేక‌లో మిస్ అయ్యాయి. న‌రేష్ సినిమాల్లో న‌వ్వుల్లేని సినిమా ఇదేన‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. అంత టైమింగ్ ఉన్న న‌టుడినీ, న‌ల‌భై మంది హాస్యన‌టుల్ని ద‌ర్శకుడు స‌రిగా వినియోగించుకోలేక‌పోయాడు. ఏదో మొక్కుబ‌డిగా అక్కడిక్కడ‌న స‌న్నివేశాల‌ను అల్లుకొన్నట్టు ఉంది త‌ప్ప, ప‌ర్‌ఫెక్ట్ స్ర్కిప్టుతో సెట్స్‌పైకి వెళ్లిన‌ట్టు అస్సలు అనిపించ‌లేదు. ఒకొక్క స‌న్నివేశం నాలుగైదు నిమిషాలు న‌డిపి ప్రేక్షకుల స‌హ‌నానికి పరీక్ష పెట్టాడు.

దేవి ప్రసాద్ పేర‌డీల‌ను ఎక్కువ‌గా న‌మ్ముకొంటాడు. లీలామ‌హ‌ల్ సెంట‌ర్ సినిమాలో అన్నీ పేర‌డీలే క‌నిపిస్తాయి. ఆఖ‌రికి దేవుడిపై కూడా సెటైర్లు వేసేశాడు. అలా దేవుళ్లను కామెడీ కోసం వాడుకోవ‌డం చాలామందికి న‌చ్చలేదు. ఈ పేర‌డీలు మాత్రం ఎన్నిసార్లు కిక్ ఇస్తాయి? మొహం కూడా మొత్తేసింది. న‌రేష్ ని ఎలా వాడుకోవాలో కూడా.. అర్థం కాలేదు. దాంతో సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇది నూటికి నూరు పాళ్లూ ద‌ర్శకుడి వైఫ‌ల్యమే అని విమ‌ర్శకులు కూడా తేల్చేశారు. ఇప్పటికీ దేవి ప్రసాద్‌కి అవ‌కాశాలొస్తే.. అది అత‌ని అదృష్టమే. అయితే దాన్నిఈసారైనా నిల‌బెట్టుకోవాలి. సినిమాలో పొలో మ‌ని క‌మెడియ‌న్లు అంద‌రినీ నింపేయ‌డం కాదు. వారికి స‌రైన పాత్రలు ఇవ్వాలి. వాళ్ల చేత వినోదం పిండుకోవాలి. అలాంట‌ప్పుడే సినిమాలు ఆడ‌తాయి. ఈ నిజం ఇప్పటికైనా ఈ ద‌ర్శకుడు గుర్తిస్తే మంచిది.