పవన్ టైటిల్ ఖరీదు 4 కోట్లా ?

pavanటాలివుడ్ లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి సీక్వెల్ గా పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చే నెలలో ప్రారంభం కానున్న ‘ గబ్బర్ సింగ్ – 2 ‘ చిత్రానికి టైటిల్ కష్టాలు వచ్చిపడ్డాయి. గతంలో రమేష్ సిప్పీ నిర్మించి ఘనవిజయం సాధించిన ‘ షోలే ‘ చిత్రంలోని ఒక పాత్ర పేరు గబ్బర్ సింగ్ అన్న విషయం తెలిసిందే. ఇదే పేరుతో పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించిన గబ్బర్ సింగ్ చిత్రం తెలుగు సినిమా రికార్డులన్నింటిని తిరగరాసింది. గబ్బర్ సింగ్ టైటిల్ వాడుకున్నందుకు గానూ అప్పట్లో గణేష్ కూడా షోలే నిర్మాతలకు కొంత రాయితీ చెల్లించినట్లు తెలిసింది. అయితే తాజాగా ‘గబ్బర్ సింగ్ – 2’ నిర్మాతలకు కూడా టైటిల్ కు కు రాయల్టీ చెల్లించమంటూ షోలే నిర్మాతలనుంచి డిమాండ్ వచ్చినట్టు సమాచారం. కనీసం 3 నుంచి 4 కోట్ల దాకా షోలే నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారట. మరి నిర్మాతలు షోలే నిర్మాతల డిమాండ్ కు తలొగ్గి అంత డబ్బు ఇస్తారా లేక టైటిల్ మార్చుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే.