స్టాప్ ఇమిడియట్లి !

మదర్ సీరియస్ అంటూ
మెసేజులిక రావు !
స్టార్ట్ ఇమిడియట్లి అనే
టెలిగ్రాములిక లేవు !

సమాచార రంగంలో
ముగిసిన ఓ ప్రస్థానం !
డామినేట్ చేసిందట
సెల్ ఫోనుల సంస్థానం !!

ఎస్సెమ్మెస్ వచ్చినాక
సందేశాలిక వేగం !
ఎవడికి కావాలి ఇంక
టెలిగ్రాము వైభోగం !!

పరిణామ క్రమంలోన
పోస్టుమ్యానుదే వంతు !
కోరియర్లూ వచ్చినాక
ఎందుకు స్టాంపుల తంతు !!

– ఏవీయస్