సంజ‌య్‌ద‌త్‌ని క‌ల‌వ‌నున్న చ‌ర‌ణ్‌!

ramcharanజంజీర్ సినిమాలో క‌ల‌సి సంజ‌య్ ద‌త్‌తో క‌ల‌సి న‌టించాడు రామ్‌చ‌ర‌ణ్‌. అంతకంటే ముందునుంచే సంజ‌య్‌ద‌త్‌, చ‌ర‌ణ్ ల‌మ‌ధ్య మంచి స్నేహం ఉంది. సంజ‌య్ ద‌త్ కోర్టులో లొంగిపోయే ముందు చ‌ర‌ణ్ సంజూ ఇంటికి వెళ్లి ఓదార్చి వ‌చ్చాడు. ఇప్పుడు సంజ‌య్ ఎర‌వాడ జైల్లో ఉన్నాడు త‌న స్నేహితుడిని క‌లుసుకోవ‌డానికి చ‌ర‌ణ్ ప్రయ‌త్నాలు ప్రారంభించాడు. సాధార‌ణంగా సంజ‌య్‌ద‌త్‌ని కుటుంబ స‌భ్యులే కల‌వ‌డానికి వీలుంది. కోర్టు అనుమ‌తి తీసుకొంటే త‌ప్ప మిగిలిన వాళ్లు జైల్లో క‌లుసుకొనే అవ‌కాశం లేదు. అందుకే న్యాయ‌స్థానానికి ఓ అభ్యర్థన ప‌త్రం పెట్టుకొన్నాడు చ‌ర‌ణ్‌. కోర్టు నుంచి అనుమ‌తి కూడా వ‌చ్చింది. దాంతో త్వర‌లోనే స్నేహితుడు సంజూని చూడ్డానికి ఎర‌వాడ వెళ్తున్నాడు చ‌ర‌ణ్‌. జంజీర్ ద‌ర్శక నిర్మాత‌లు కూడా చ‌ర‌ణ్‌తో పాటు ఎర‌వాడ వెళ్లనున్నారు.