చ‌ర‌ణ్‌కి హ్యాండిచ్చి.. మ‌హేష్‌ని ప‌ట్టుకొన్నాడు!

mahesh-babu-koratalaమిర్చితో తొలి అడుగులోనే అద‌ర‌గొట్టాడు… కొర‌టాల శివ‌. ఆ త‌ర‌వాత పెద్ద హీరోల చూపు ఈ యువ ద‌ర్శకుడిపై ప‌డింది. రామ్‌చ‌ర‌ణ్ కూడా ప‌చ్చజెండా ఊపేయ‌డం, ఆ సినిమా కొబ్బరికాయ కొట్టుకోవ‌డం చ‌క‌చక జ‌రిగిపోయాయి. ఆ సినిమాకి టాప్ లేచిపోద్ది అనే టైటిల్ కూడా అనుకొన్నారు. ఇప్పుడు ఆ సినిమా ప‌క్కన పెట్టేశారు. కార‌ణం అడిగితే క‌థ ఇంకా రెడీ కాలేదంటున్నార‌ట‌. కానీ అసలు విష‌యం అది కాద‌ట‌.శివ క‌థ‌కు చ‌ర‌ణ్ అంటే.. మ‌హేష్‌బాబు అయితేనే బెట‌ర‌ని అనుకొంటున్నాడ‌ట‌. అందుకే.. చ‌ర‌ణ్‌కి హ్యాండిచ్చి మ‌హేష్ పంచ‌న చేరాడు. ఈ సినిమాకి బండ్ల గ‌ణేష్ నిర్మాత‌గా వ్యవ‌హ‌రించ‌నున్నాడు. త్వర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుస్తాయి.