ఎన్టీఆర్ వెన‌క‌బ‌డ్డాడా?

ntrమొన్నటి వర‌కూ మ‌హేష్‌బాబు మానియా! ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ నామ జ‌పం. వీరిద్దరి సినిమా అంటే జ‌నం వెర్రిగా ఎదురుచూస్తున్నారు. వీళ్ల టీజ‌ర్లు వ‌చ్చినా హిట్ చేసేస్తున్నారు. వీరితో పోలిస్తే… ఇమేజ్‌లోనూ, స్టార్ డ‌మ్‌లోనూ ఎన్టీఆర్ త‌క్కువోడేం కాదు. కానీ ప్రస్తుతం మాత్రం పూర్తిగా వెన‌క‌బ‌డ్డాడు.

దానికి నిద‌ర్శనం… టీజ‌ర్లే! మహేష్ సినిమా వ‌న్ కంటే ముందే.. రామయ్యా వ‌స్తావ‌య్యా టీజ‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. బుడ్డోడూ బుడ్డోడూ అంటే బ‌ట్టలూడ‌దీసి కొడ‌తా అనే ప‌వ‌ర్ ఫుల్ డైలాగు చెప్పాడు ఎన్టీఆర్‌. ఈ హంగామా మొత్తం మ‌హేష్ బాబు వ‌న్ టీజ‌ర్‌తో తుస్సుమంది. వ‌న్ టీజ‌ర్ విడుద‌లైన తొలి రొజు నుంచే నెటిజ‌న్ల సంద‌డి మొద‌లైపోయింది. ప‌ది ల‌క్షల వ్యూవ‌ర్స్ వ‌న్ టీజ‌ర్ చూశారు.

ఆ త‌ర‌వాత అత్తారింటికి దారేదితో ప‌వ‌న్ మరో ప్రభంజ‌నానికి తెర‌లేపాడు. ఈ టీజ‌రూ సూప‌ర్ హిట్టే. వీటితో పోలిస్తే రామయ్యా వ‌స్తావ‌య్యా టీజ‌ర్ తేలిపోయింది. ఎన్టీఆర్ అభిమాన‌గ‌ణం క్రమంగా త‌గ్గిపోతుంది అని చెప్పడానికి ఇంత‌కంటే నిద‌ర్శనం ఏం కావాలి?? రొటీన్ క‌థ‌లు, యాక్షన్ మోజుతో రోత పుట్టించే సినిమాలు తీస్తున్నాడు ఎన్టీఆర్‌. ఆ ప్రభావ‌మే ఇదంతా. దాంతోపాటు మ‌హేష్‌, ప‌వ‌న్ ధాటికి త‌ట్టుకోలేక‌పోతున్నాడు. రామ‌య్యా వ‌స్తావ‌య్య హిట్ కొట్టి… ఈ ఇద్దరు హీరోల‌కూ చెక్ పెట్టే స్థాయికి ఎన్టీఆర్ చేరుకోవాల‌ని నంద‌మూరి ఫ్యాన్స్ ఆశ‌. మ‌రి అది తీరుతుందా??