‘తలైవార్’… రజినీకి అంకితం

rajini-sharukhబాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, సూపర్ స్టార్ రజినీకు ఓ ప్రత్యేక గీతాన్ని అంకితం ఇస్తున్నారు. షారుక్ తాజా చిత్రం ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ ఆగస్టు 9 న విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రం కు అనుబంధంగా ఓ స్పెషల్ సాంగ్ ను రెడీ చేస్తున్నారు. ఈ పాటను సింగర్ హనీ సింగ్ ఆలపించారు. సూపర్ స్టార్ రజినీ కాంత్ పై సాగే ఈ పాటలోషారుక్, దీపిక పదుకొనే జంటగా కనిపిస్తారు. అయితే ఈ పాట ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ లోనిది కాదని, రజినీ సార్ పై స్పెషల్ సాంగ్ అని షారుఖ్ చెబుతున్నారు. ‘తలైవార్ లుంగీ డాన్స్’ పేరుతో ఆ పాట అభిమానులను అలరించనుంది.