కోట్లా దారికొచ్చాడా…?

Kotla-Surya-Prakash-Reddy-Kurnool-Parliment-Congressతెలంగాణ అంశంపై సమైక్యాంధ్ర నేతల స్వరం మారుతోంది. కరుడుగట్టిన సమైక్యవాదులు సైతం సైలెన్స్గ్ గా స్టాండ్ మారుస్తున్నట్లు సమాచారం. మొన్న కావూరి, నిన్న ఉండవల్లి, నేడు కోట్ల అన్నట్లు.. తమ వైఖరిని ప్రదర్శిస్తూనే అధిష్టానం తీసుకునే స్టాండ్ కు కట్టుబడివుంటామని.. వారి వారి స్టాండ్స్ ను కాస్త పలుచబరిచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తాజాగా చేసిన ప్రకటనలో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, లేదా మూడు ముక్కలు చేయాలని కోరారు. అదే సమయంలో..  ఆయన అదిష్టానం మాటకు కట్టుబడి ఉంటానని ప్రకటించారు. కోట్ల తాజా ప్రకటనతో.. ఆయన కూడా అధిష్టానం దారిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. సమైక్యంగా ఉంచకుంటే.. అధిష్టానాన్ని ఎదిరిస్తామనే లెవల్లో మాత్రం ఎవరూ కూడా ప్రకటనలు చేయక పోవడం విశేషం.