అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్ పాత్ర ఎలా ఉంటుంది? అతను ఏం చేస్తాడు?? – ఇందుకు సంబంధించిన ఓ క్లూ దొరికింది. ఈ సినిమాలో పవన్ నదియా ఇంట్లో డ్రైవర్ గా పనిచేస్తాడట. కానీ ఫ్లాష్ బ్యాక్‌లో ఓ మిలియనీర్ అట. మరి అన్ని కోట్లుండి ఓ డ్రైవర్‌గా ఎందుకు పనిచేయాల్సి వచ్చింది? అసలు నదియా ఇంటికే ఎందుకొచ్చాడను అనేదే ఈ సినిమా కథ.
విదేశాల్లో ఉన్నపవన్… ఇండియాలో తనకు ఓ అత్తమ్మ ఉందని, ఆ కుటుంబంతో ఎన్నో యేళ్లుగా విబేధాలున్నాయని తెలుస్తుంది. తాతయ్య బొమన్ ఇరానీ దగ్గర అనుమతి తీసుకొని అత్తారింటికి దారేది అంటూ వెతుక్కొంటూ ఇండియా వస్తాడు. ఇక్కడ సమంతతో ప్రేమలో పడతాడు. ఇంతకీ సమంత ఎవరో కాదు.. అత్తమ్మ కూతురే. అందుకే ఆ ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. మరి అత్తమ్మని ఎలా దారిలోకి తీసుకొచ్చాడు అనేదే ఆసక్తికరం. స్టోరీ లైన్ కాస్త రొటీన్‌గానే ఉన్నా.. తీస్తోంది త్రివిక్రమ్, చేస్తోంది పవన్ కదా.. తప్పకుండా అదరగొట్టేసే ఉంటారు. ఈసినిమా ఎంత అదిరిపోతుందో.. తెరపై చూడాల్సిందే.