ఊరి పోరులో.. 2623 ఏకగ్రీవం !

panchyat-pollsరాష్ట్ర వ్యాప్తంగా ఊరిపోరులో.. పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ముఖ్యంగా పంచాయితీ ఎన్నికల ఏకగ్రీవ ఎన్నికల్లో పార్టీల మధ్య పోరు మరీ రంజుగా మారింది. 21144 పంచాయితీలకు ఎన్నికలు జరుగుతుండగా.. నామినేషన్ల ఉపసంహరణ వాటిలో 2623 పంచాయితీలు ఏకగ్రీవమయ్యాయి. పంచాయితీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినా.. దాదాపు అన్నీ చోట్ల పార్టీలు బలపర్చిన అభ్యర్థులే బరిలో ఉండటం విశేషం. ఊరిపోరును చూస్తే.. సాధారణ ఎన్నికల సమరాన్ని తలపిస్తుంది.అయితే, ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులలో..అధికాంగ్రెస్ మొదటి స్థానంలో ఉండగా, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా ధీటుగా పోటీపడుతోంది. మూడవ స్థానంలో వైకాపా ఉంది. ఇక తెలంగాణ ప్రాంతంలో తెరాస కొంచెం దూకుడుగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా, ఏకగ్రీవమైన పంచాయితీల్లోనూ అత్యధికం పార్టీల బలాబలాలు, ఇతరత్రా ప్రలోభాలు, లోపాయికారి వ్యవహారాలు, అవగాహనల ఆధారంగానే అయినట్లు
తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవమైన పంచాయితీల్లో అధికార కాంగ్రెస్ 764, టీడీపీ 570, వైకాపా 400, తెరాస 88, సీపీఐ 3, సీపీఎం 8, న్యూడెమొక్రసీ 9, భాజపా 4 వచ్చాయి. కాగా, 750 స్థానాల్లో స్వతంత్రులు/ఇతరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

జిల్లాల వారీగా ఏకగ్రీవమైన వివరాలు :
uninamous