కాంగ్రెస్ లో కాలుపెట్టనున్న హరీష రావు ..?

T-Harish-Raoరాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ.. శాశ్వత శత్రవులు కానీ ఉండరంటారు. అవును మరీ… తెరాస సీనియర్ నేత, స్వయాన తెరాస అధినేత కేసీఆర్ మేనల్లుడు కాంగ్రెస్ లో కాలుపెట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఎలాగూ..  గతకొంత కాలంగా కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా ఉన్నదని ప్రకటిస్తూ.. వస్తోంది. అంతేకాకుండా తాజా కోర్ కమిటీ భేటీలోనూ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడానికి మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే.. హరీష్ రావు కాంగ్రెస్ లో కాలుపెట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారంగా తెలుస్తోంది.

తెరాస లో  కేసీఆర్ తరవాత ఆస్థాయిలో  హవా హరీష్ రావు సొంతం. అయితే, హరీష్ రావును కాంగ్రెస్ లోకి లాగడానికి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ లీడ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా మరికొంత మంది గులాబి ఎమ్మెల్యేలకు గాలం వేయడానికి సిద్ధమయినట్లు సమాచారం.  అయితే, చాలా మంది ఈ విషయాన్ని ఖండిస్తున్నప్ప్పటికినీ.. . నిప్పులేనిదే పొగరాదుగా అని కొందరు అంటున్నారు.

ఇప్పటి వరకూ తెదేపా, కాంగ్రెస్ నుంచి వలసలుగా తెరాసలోనికి వచ్చిన సందర్భాలున్నాయి. ఇప్పుడు రివర్స్ గేర్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించవచ్చు అన్నమాట. ఒక వేళ హారీష్ రావు గనుక కాంగ్రెస్ లో కాలుపెట్టినట్లయితే.. కేసీఆర్ రాజకీయ జీవితం కాటికి చేరినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.