హృతిక్ డిశ్చార్జ్

Hrithik-discharged-from-hosబాలీవుడ్ హీరో, డాన్సింగ్ స్టార్ హృతిక్ రోషన్ ఈ రోజు హిందూజా ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యారు. శస్త్రచికిత్స అనంతరం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ఆయన ఆసుపత్రి బయట మీడియాకు వెల్లడించారు. రెండు నెలల క్రితం ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమాలో పోరాట సన్నివేశాల చిత్రీకరణ సందర్భంగా హృతిక్ తలకు గాయమైంది. అప్పట్నుంచి చికిత్స తీసుకుంటున్నా హృతిక్ కు ఉపశమనం కలగకపోవడంతో ఆదివారం ఆయన తలకు శస్త్రచికిత్స చేశారు. హృతిక్ జరిగిన శస్త్రచికిత్స లో మెదడు లో రెండు నెలలుగా గడ్డకట్టిన పదార్థం బయటకు తీశారు. నాలుగు వారాలు పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు హృతిక్ కు సూచించారు. హృతిక్ కారులోకి వెళుతూ … నేను చాలా బాగున్నాను… నా ఆరోగ్యం గురించి ప్రార్ధించిన మీ అందరికి థాంక్స్ అని అభివాదం చేశాడు.